ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - సరస్వతీ పవర్‌ అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - SARASWATI POWER ASSIGNED LANDS

పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు గుర్తింపు - వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ప్రకటన

Saraswati Power Lands Issue in AP
Saraswati Power Lands Issue in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 10:35 AM IST

Saraswati Power Assigned Lands Issue : మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్‌ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దుచేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా మాచవరం తహసీల్దార్‌ క్షమారాణి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలు అసైన్డ్‌ భూములున్నాయని మొదట కలెక్టర్‌కు తహసీల్దార్‌ నివేదిక ఇచ్చారు.

అనంతరం ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్‌ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేస్తున్నామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్​ కలెక్టర్‌కు విన్నవించారు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని పిడుగురాళ్ల సబ్‌రిజిస్ట్రార్‌కు తహసీల్దార్‌ నివేదిక ఇచ్చారు. బుధవారం అసైన్డ్‌ భూముల దస్తావేజులతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి పనులు పూర్తిచేశారు. మొత్తం 24.84 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి సరస్వతీ పవర్‌ పేర ఉన్న రిజిస్ట్రేషన్లను రద్దుచేశారు.

అసలేం జరిగిదంటే :గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500ల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ రాజశేఖర్​రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. అయితే దాదాపు 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో అటవి భూములతో పాటు సహజ వనరులు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. చట్టప్రకారం అసైన్డ్ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు.

AP Govt Cancelled Saraswati Lands : ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్​కు చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ, చెరువులు, కుంటలు, అసైన్డ్​కు​ చెందిన భూములు ఉంటే గుర్తించాలంటూ సర్వేకు ఆదేశాలిచ్చారు. స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు సర్వే చేసి అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. దీంతో తాజాగా ఆ భూముల రిజిస్ట్రేషన్లను రద్దుచేశారు.

పల్నాడు జిల్లాలో భారీ భూ కుంభకోణం? - శాఖలను తప్పుదోవపట్టించి మాజీ సీఎం జగన్ అడ్డగోలు మేళ్లు!

పవన్​ పల్నాడు జిల్లా పర్యటన - సరస్వతి పవర్ భూముల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details