తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్సార్సీపీ కుట్రలపై ఏపీ నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! - DGP Focus on AP Election 2024 - DGP FOCUS ON AP ELECTION 2024

AP DGP Harish Kumar Gupta Focus on Police Behavior : ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ సందర్భంలో అధికార వైఎస్సార్సీపీ అరాచకాలకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక స్థానాల్లో వైఎస్సార్సీపీ బంటులైన అధికారులను అడ్డం పెట్టుకొని అనుకూలంగా బందోబస్తు ప్రణాళికలు రూపొందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, డీఏస్పీలను మార్చినంత మాత్రాన సరిపోదు. బందోబస్తు ప్రణాళికను క్షుణ్ణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకొని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

DGP Harish Kumar Gupta Focus on AP Election 2024
AP DGP Harish Kumar Gupta Focus on Police Behavior (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 12:45 PM IST

వైఎస్సార్సీపీ కుట్రలపై నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! (ETV Bharat)

DGP Harish Kumar Gupta Focus on AP Election 2024 :ఏపీలోఎన్నికల వేళ అనుకూలమైన అధికారులుంటే వారిని అడ్డం పెట్టుకొని ఏదోరకంగా గెలవొచ్చనే దురుద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకులు షెడ్యూల్‌ రాకమునుపే వారికి కావాల్సిన అధికారులను ఏరికోరి మరీ తెచ్చిపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీతో అంటకాగుతూ, ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేసే వారినే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలుగా నియమించుకున్నారు. వారిని అడ్డం పెట్టుకొని పోలింగ్‌ రోజున ప్రతిపక్షాల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసే కుట్రలను సిద్ధం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేసిన కుట్రపూరిత చర్యలనే మరింత ఉద్ధృతంగా చేపట్టాలని చూస్తున్నారు. తీవ్ర హింసాత్మక ఘటనలకు పాల్పడి తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులను ఓటింగ్‌కు రానివ్వకుండా అడ్డుకోవడానికి పథక రచన చేశారు. ప్రతిపక్షాల తరఫున ఏజెంట్లుగా కూర్చునే వారిని బెదిరించటం, వారిపై దాడులు చేయటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న ముసుగులో విపక్షాల వారిని గృహనిర్బంధం చేయించటం వంటి దుశ్చర్యలకు తెగబడేందుకు స్కెచ్‌ గీశారు.

జగన్‌ కోసం దేనికైనా 'సిద్ధం' - కుట్రల అమల్లో వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి - CS Jawahar Reddy Support To Jagan

దుశ్చర్యలకు తెగబడేందుకు స్కెచ్‌ :ఈ కుట్ర అమలుకు వీలుగా బందోబస్తు ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా తక్షణం ఆ కుటిల వ్యూహాల్ని నిర్వీర్యం చేయాలి. వాటిల్లో భాగస్వాములైన ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను అక్కడి నుంచి తప్పించాలి. వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి. అధికార వైఎస్సార్సీపీ బంటుల్లా పని చేస్తున్న అధికారులు కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీల శ్రేణులను పెద్ద ఎత్తున బైండోవర్‌ చేస్తున్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

కొందరిపై పక్షపాతంగా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఏకంగా హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద ఇరికిస్తున్నారు. పాత కేసులను తిరగదోడుతూ బెదిరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి అనుమతులివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైసీపీ నాయకులు దాడులు, దాష్టీకాలు, దమనకాండకు పాల్పడుతుంటే వాటిల్లో ఏ ఒక్క ఘటనలోనూ చర్యలు తీసుకోవట్లేదు. నిందితుల్ని అరెస్టు చేయట్లేదు. పైగా బాధితులపైనే కేసుల నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో క్రియాశీలకంగా ఉంటున్న వారిని అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ కుట్రలు :తాజాగా ఎన్నికల సంఘం ద్వారా బదిలీ వేటుకు గురైన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, మహబూబ్‌ బాషాలే దీనికి ఓ ఉదాహరణ. ఇలాంటి అధికారులు టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై గత నెల రోజుల వ్యవధిలో పెట్టిన బైండోవర్లు, అక్రమ కేసుల్ని నూతన డీజీపీ సమీక్షించాలి. వారిపై తెరిచిన రౌడీషీట్లను పునఃపరిశీలించాలి. కేవలం ప్రతిపక్షాల్ని వేధించటం, క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని కట్టడి చేయటమే లక్ష్యంగా పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలి. లేకపోతే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి బలాలు దెబ్బతింటాయి. వైసీపీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజురోజుకు ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లుతుండటం, గెలిచే దారులన్నీ మూసుకుపోతుండటంతో హింస, దాడులు, దౌర్జన్యాన్ని నమ్ముకుని పైచేయి సాధించాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలన్నింటిలో పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలని విపక్షాలు కోరుతున్నాయి. వైసీపీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న పోలీసు అధికారులను అక్కడి నుంచి తప్పించి వారి స్థానంలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండే వారిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలన్నింటిలోనూ వెబ్‌కాస్టింగ్‌ చేపట్టాలని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినా, నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకోగలిగేలా సమీపంలో రిజర్వు బలగాల్ని ఉంచాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

జగన్ నిరాశావాదం - ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతుందన్న ఏపీ సీఎం - JAGAN IN COMPLETE PANIC MODE

జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరం - నేనూ బాధితుడినే : విశ్రాంత ఐఏఎస్ అధికారి - EX IAS on Land Titling Act

ABOUT THE AUTHOR

...view details