ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులుల సంరక్షణ చర్యలపై పవన్ కల్యాణ్ సమీక్ష- అటవీ అధికారులకు పలు సూచనలు - PK Review on Tiger Conservation

Pawan Kalyan Review on Tiger Conservation: పులుల సంరక్షణపై అటవీశాఖ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం అటవీప్రాంతాల్లోని పులుల సంరక్షణపై సమీక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అరణ్య భవన్‌కు వచ్చిన పవన్ కల్యాణ్‌... బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తీసిన పులుల ఫొటోలను తిలకించారు.

Pawan Kalyan Review on Tiger Conservation
Pawan Kalyan Review on Tiger Conservation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 3:49 PM IST

Updated : Jul 29, 2024, 7:05 PM IST

Pawan Kalyan Review on Tiger Conservation: పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్, నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్​లో అధికారులతో సమీక్షించారు. గ్లోబల్ టైగర్ డే (International Tiger Day) సందర్భంగా అరణ్య భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో పులుల సంఖ్య, అభయారణ్యంలో తీసుకోవలసిన భద్రత చర్యలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు (బేబీ నాయన) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్​ను తిలకించారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక్కో ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.

స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం- పవన్‌ - Pawan on Govt Schemes Names

అడవులు మన సంస్కృతిలో భాగమని, అక్కడుండే ప్రాణులు కూడా మనకు ఎంతో అవసరమని పవన్ కల్యాణ్​ చెప్పారు. వాటి సంరక్షణ బాధ్యతలు ప్రజలు, ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. అటవీశాఖా మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పూర్తిగా తాను కట్టుబడి ఉన్నానని, అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అక్రమంగా పులుల్ని వేటాడే వారిపైనా, స్మగ్లింగ్​కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వన్య ప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు అటవీ పరరిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటిని అమలుపరిచే బాధ్యత తాను తీసుకుంటానని పవన్‌ చెప్పారు.

పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో జూ పార్కులు అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్దామన్నారు. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ చెప్పారు. టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వేటగాళ్లను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

పులల సంరక్షణకు అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని సూచించారు. శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని, వాటిని తగ్గించేందుకు పర్యావరణహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.

మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection

Last Updated : Jul 29, 2024, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details