తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను బలోపేతం చేస్తాం : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan on AP Red Sandalwood - PAWAN KALYAN ON AP RED SANDALWOOD

PAWAN KALYAN ON RED SANDALWOOD: ఆంధ్రప్రదేశ్​లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్‌కు తరలిపోయిన ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పవన్‌ ఆదేశించారు.

Pawan Kalyan on AP Red Sandalwood
Pawan Kalyan Visits Assembly Premises (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:03 AM IST

PAWAN KALYAN ON RED SANDALWOOD: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని ఆయన సూచనలు జారీ చేశారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్​ను బలోపేతం చేస్తామని తెలిపారు.

Pawan Kalyan Visits Assembly Premises: రాష్ట్ర శాసనసభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కల్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు.

ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan

శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ సమస్యలను చెప్పుకొన్నారు. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పని చేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని, ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు.

న్యాయం చేస్తామని పవన్ హామీ: అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని, తరువాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేలుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

ABOUT THE AUTHOR

...view details