AP CRDA 38th Authority Meeting Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ(CRDA) అథారిటీ 38వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఎఎస్‌ల కోసం నిర్మించిన అపార్టుమెంట్ల వద్ద మిగిలిపోయిన పనుల కోసం రూ.524 కోట్లకు పాలనానుమతి ఇచ్చారు. 18 టవర్లు, 432 అపార్టుమెంట్ల నిర్మాణం కోసం పనులు చేపట్టేందుకు పాలనానుమతి ఇచ్చారు. అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం జీప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ. 160 కోట్లతో అనుమతి ఇచ్చారు. సీఆర్డీఏ, ఏడీసీ, పురపాలక శాఖలోని అన్నిహెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు.
వెయ్యి కోట్లతో అమరావతి రైల్వే లైన్ - పనులు వేగవంతం - New Amaravati Railway Line
ఆ నెలలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి :రాజధాని పరిధిలో ఏడీసీ(ADC) నిర్మించిన 360 కిలోమీటర్ల రహదారులు, డక్టుల నిర్మాణానికి సంబంధించి రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని గ్రావిటీ కెనాల్‌లో వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నెదర్లాండ్స్ నుంచి గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన డిజైన్లు కూడా తీసుకున్నామన్నారు. అదనపు వరద నీటి కోసం ఆరు చోట్ల రిజర్వాయర్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. డిసెంబరులోపు అన్ని పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.