ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పరిస్థితి ఏంటి?- నేడు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం - CM Chandrababu Visit to Polavaram - CM CHANDRABABU VISIT TO POLAVARAM

AP CM Chandrababu Visit to Polavaram Project : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి? ఎన్నింటికి మరమ్మతులు చేయాలి? అనే విషయాలను ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది.

cm_chandrababu_visit_to_polavaram
cm_chandrababu_visit_to_polavaram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 7:49 AM IST

Updated : Jun 17, 2024, 9:21 AM IST

AP CM Chandrababu Visit to Polavaram Project :ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి జిల్లా పర్యటన కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 2014-19లో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా పనుల పురోగతిని పర్యవేక్షించేవారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రోజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఒంటిగంట 30 నిమిషాల వరకు పనులు పరిశీలించి, 3 గంటల 5 నిమిషాల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.

చంద్రబాబు పర్యటన షెడ్యూల్ (ETV Bharat)

ప్రశ్నార్థకంగా మారిన పోలవరం కీలక కట్టడాలు - చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్! - Polavaram Construction

CM Chandrababu to Polavaram :ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి? ఎన్నింటికి మరమ్మతులు చేయాలి? అనే విషయాలను ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది.

పోలవరం నుంచే సీఎం తొలి క్షేత్రస్థాయి పర్యటన - ప్రస్తుత స్థితిగతులను పరిశీలించనున్న చంద్రబాబు - Chandrababu Visit Polavaram Project

Polavaram Development :సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆదివారం ఆమె పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌, బారికేడ్లు, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, హెలీఫ్యాడ్‌ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు,ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐటీడీఏ పి.ఓ యం. సూర్య తేజ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, మండల అధ్యక్షులు చిన్ని,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైసీపీ విధ్వంసానికి పోలవరంపై అనిశ్చితి - రివర్స్‌ నిర్ణయాలతో సాగని నిర్మాణం - negligence on polavaram project

Last Updated : Jun 17, 2024, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details