తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు - కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోను : చంద్రబాబు - AP CM Chandrababu Teleconference - AP CM CHANDRABABU TELECONFERENCE

AP CM Chandrababu Teleconference : పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటడ్ పదవులు, త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నాని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ఘనవిజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని తెలిపారు.

Chandrababu tele conference
Chandrababu tele conference (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 7:21 PM IST

AP CM Chandrababu Teleconference with TDP Activists :త్వరలోనే పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటడ్ పదవులు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కింద స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేసి వారికి తగిన పదవులు ఇస్తామని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయని తెలిపారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని చంద్రబాబు అన్నారు.

లోటస్​పాండ్​లో జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు - Jagan illegal sheds demolished

కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నా : కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్​తో 57 శాతం ఓట్ షేర్‌ను సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల వేళ మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పని చేశారని వివరించారు. ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత ఐదేళ్లుగా కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానని చంద్రబాబు వెల్లడించారు.

2047 నాటికి తెలుగువారు నెంబర్ -1 :అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం, ప్రజలు తప్పుపట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు, నాయకులను, కార్యకర్తలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలన్నారు. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లో వస్తాయని తెలిపారు. అహంకారానికి దూరంగా, బాధ్యతగా,చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలి అందులో తెలుగువారు నెంబర్ -1 గా ఉండాలి అనే లక్ష్యంతో కలసికట్టుగా కష్టపడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

నన్ను జైలుకు పంపినందుకు నేను చేయబోయేది ఇదే : ఏపీ సీఎం చంద్రబాబు - AP CBN Fires IAS And IPS

తెలుగు జాతికి పెద్దన్నలా ఉంటాను - అమరావతిని హైదరాబాద్​ మాదిరి తీర్చిదిద్దుతా : ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU ON HYD

ABOUT THE AUTHOR

...view details