AP Bhavan Land in Delhi Divided: దిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ భూమిని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు పంచింది. దిల్లీ నడిబొడ్డున ఎకరా 501 కోట్ల రూపాయలు విలువ చేసే 19.71 ఎకరాల భూమిని 58.32, 41.68 శాతం నిష్పత్తిలో పంచింది. మొత్తం 9వేల 913 కోట్ల 50 లక్షల విలువైన ఈ భూమిలో రాష్ట్రానికి 5వేల 781 కోట్ల 41 లక్షల రూపాయల విలువైన 11.536 ఎకరాలు, తెలంగాణకు 4వేల 132కోట్ల 8 లక్షల విలువైన 8.245 ఎకరాలు దక్కాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్రమత్తమైన అధికారులు- ముమ్మరంగా ఫ్లెక్సీల తొలగింపు
విభజన చట్టంలో చెప్పిన సూత్రాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విధానం ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ భూమిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఆస్తి వివాదం పరిష్కారం అయినట్లయింది. మార్చి 11న జరిగిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో రెండు ప్రభుత్వాలూ అంగీకరించిన ఆప్షన్-జీ ప్రకారం భవన్ ఆస్తులను విభజించినట్లు హోంశాఖ శుక్రవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.