Lavanya Raj Tarun Case :హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రియురాలులావణ్య చేసిన ఆరోపణల్లో కొత్త కోణం వెలుగుచూసింది. హీరో రాజ్‌తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి అనే వ్యక్తి కారణమని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా మస్తాన్ సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు అమ్మాయిలకు సంబంధించిన ‘ప్రైవేట్’ వీడియోలను చిత్రీకరించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డ్‌డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
హీరో రాజ్‌తరుణ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ - మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు - ACTOR RAJ TARUN CONTROVERSY
నటుడు రాజ్‌తరుణ్ వివాదంలో ఇద్దరి అరెస్టు - మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిన రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య - మస్తాన్‌సాయి వద్ద పలువురు యువతుల వీడియోలు ఉన్నాయని ఫిర్యాదు
![హీరో రాజ్‌తరుణ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ - మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు ACTOR RAJ TARUN CONTROVERSY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2025/1200-675-23464813-thumbnail-16x9-lavanya1.jpg)
Published : Feb 3, 2025, 5:31 PM IST
|Updated : Feb 3, 2025, 6:51 PM IST
ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు :మస్తాన్ సాయి, ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లుగా లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసినట్లుగా తెలిసింది. మస్తాన్ సాయి, ఖాజాలపై 329(4),324(4),109,77,78 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా సమాచారం.
మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తనను ప్రేమించి, మోసం చేశాడంటూ రాజ్‌తరుణ్‌పై లావణ్య గతేడాది ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆమె నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె కంప్లైంట్ మేరకు నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.