Digital Tokens in Bhadrachalam : భద్రాచల రామాలయంలో అన్నదానం నిమిత్తం డిజిటల్ టోకెన్ల జారీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇంతకు ముందు క్యూలో వేచి ఉన్న భక్తులకు పరిమిత సంఖ్యలో అన్నదానం టికెట్లను ఇచ్చేవారు. నవంబరు 13 నుంచి అన్నదానం డిజిటల్ టోకెన్లను ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలాగే భక్తులు తీసుకున్న ఫొటోతో కూడిన టోకెన్‌ను ఇస్తున్నారు. ఈ టోకెన్‌ను అన్నదాన సత్రంలో చూపించి భోజనం చేయవచ్చని తెలిపారు.
అన్నదానం డిజిటల్ టోకెన్లు :మధ్నాహ్నం 2 గంటల వరకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో రోజుకు 1,500 మంది నుంచి 2వేల మంది అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. ఈ విధానంతో అన్నదాన ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా సాగుతోందని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇదే విధంగా ప్రొటోకాల్ దర్శనాల్లో కూడా డిజిటల్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దీంట్లో ఇచ్చినవారి వివరాలతో పాటు దర్శనానికి వచ్చిన వారి ఫొటోలను డిజిటల్ టోకెన్‌లో పెడుతున్నారు.
TTD Arrangements For Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70,000 పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ అధికారులు చర్యలు చేశారు.