Anksapur School Students Innovations :నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు రఘునాథ్, ఆవిష్కరణల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలి బదిలీల వరకు నందిపేట్ మండలం సుర్భిర్యాల్‌లో పని చేయగా, ప్రస్తుతం వేల్పూర్ మండలం అంక్సాపూర్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. చేసేది ఎక్కడైనా పనిలో మాత్రం బేధం లేదు. ఎక్కడున్నా విద్యార్థులను ప్రోత్సహిస్తూ నయా ఆవిష్కరణలకు నాందిగా నిలుస్తున్నారు.
సుర్భిర్యాల్ పాఠశాలలో ఉండగా 'బ్రిక్స్ లిఫ్టింగ్ వితౌట్ కరెంట్' అనిచేసి ఇంటింటా ఇన్నొవేటర్ అవార్డు, రాష్ట్రస్థాయి విలేజ్ ఇన్నోవేటర్ పురస్కారం సొంతం చేసుకున్నారు. అది కాకుండా రఘునాథ్ మాస్టారు ప్రోత్సాహంతో విద్యార్థులు 'లిఫ్ట్ ఇరిగేషన్ వితౌట్ కరెంట్' అనే పరికరం తయారు చేశారు. ఈ ప్రాజెక్టు సైతం జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటిందని చెబుతున్నారు రఘునాథ్ మాస్టార్.
'2002 నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఎక్స్పరిమెంట్స్ పిల్లలకు చెబుతూ, వారి ద్వారా తయారు చేయించాను. ఇప్పటి వరకు దాదాపుగా పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులు ఆరు, ఏడు సార్లు స్టేట్ లెవల్లో సెలక్ట్ అయ్యాయి. కరోనా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లలు గ్రామ స్థాయిలో సమస్యలుపరిష్కరించేలాపరికరాలు తయారు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని స్టేట్ లెవల్లో సెలెక్ట్ చేస్తారు. అలా మా మార్గదర్శకంలో ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు మూడు సార్లు సెలెక్ట్ అయ్యాం'- రఘునాథ్, ఉపాధ్యాయుడు