తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో సంక్రాంతి జోష్ : పశువుల అందాల పోటీలు - ఎడ్ల బండి పందేలు - ANIMAL BEAUTY CONTEST IN WARANGAL

వరంగల్ జిల్లాలో జంతువుల అందాల పోటీలు - ఆదిలాబాద్​లో ఎడ్ల బండి పోటీలు - సంక్రాంతిని సంబరంగా చేసుకుంటున్న గ్రామస్థులు

Animal Beauty Contest in Warangal
Animal Beauty Contest in Warangal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2025, 2:18 PM IST

Animal Beauty Contest in Warangal :సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించారు. శాంతి సేన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే మూగ జీవాలైన జోడేడ్లు, ఆవు దూడలు, గొర్రె పొట్టేలు, మేకలతో పాటు సాదు జంతువులైన కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పుంజులు, సీమ కోళ్ళు, బాతులు తదితర జంతువులకు అందాలో పోటీలు నిర్వహించారు.

దీంతో వాటిని పెంచేవారు వాటిని అందంగా ముస్తాబు చేసుకుని వచ్చారు. ఆవులకు కలర్లు వేసి అలంకరించారు. గొర్రెలకు, మేకల కొమ్ములకు రిబ్బన్లు కట్టారు. కొందరైతే కుక్కలు, పిల్లులకు రిబ్బన్లు కట్టి ముస్తాబు చేశారు. కోడి కాళ్లకు, మేడకు గిఫ్ట్​ రిబ్బన్లు కట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరైన ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి విజేతలకు బహుమతి అందజేశారు.

తెలంగాణలో సంక్రాంతి జోష్- పశువుల అందాల పోటీలు - ఎడ్ల బండి పందాలు - వింటలేరు కదా (ETV Bharat)

ఈ 3 రోజులు ఇలా చేస్తే - ఈ సంక్రాంతి జీవితాంతం గుర్తుండిపోతుంది!

ఎడ్ల పందాలు :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సంక్రాంతిని పందాల పోటీలలో పాల్గొన్నారు. బాబాపూర్ గ్రామ శివారులోని వాగు వద్ద గత పది సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ రోజు ఎడ్ల పందాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వాగు వద్ద పండుగ ఉదయం ఎడ్ల పందాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5వేలు ఇచ్చారు.

వివిధ పోటీలు : ప్రతి సంవత్సరం బాబాపూర్ గ్రామంలో ఎడ్ల పందాలతో పాటు ముగ్గులు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించారు. ఎడ్ల పందాల పోటీలను తిలకించడానికి జిల్లాలోని నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.

బెల్జియంలో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబురాలు

ఈసారి భోగి ఎంతో ప్రత్యేకం - 110 ఏళ్లకు ఒకసారి ఇలా! - మంటల్లో ఇవి దహనం చేసేద్దాం!

ABOUT THE AUTHOR

...view details