AP Weather Latest Updates :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులు దీనికి కారణమని వివరించింది. దీంతో ఏపీ రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడన ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ గాలులు తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఉంటాయని పేర్కొంది. వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.
తప్పిన వాయుగుండం ముప్పు - మూడు రోజుల్లో వానలే వానలు - AP RAIN UPDATES
వాయుగుండం బలహీనపడినట్లు తెలిపిన వాతావరణశాఖ - తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం - వచ్చే మూడు రోజుల్లో వర్షాలు
Published : Dec 22, 2024, 10:24 AM IST
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు : సముద్రం అలజడిగా ఉన్న కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శనివారం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తగ్గాయి. మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.