Andhra Pradesh Elections 2024: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన గదిలోకి వెళ్లేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారు. ఇది గమనించిన తెలుగుదేశం నేతలు వారిని అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు లోపలికి వెళ్తున్నా వారిని అడ్డుకోలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని, ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
రెచ్చిపోయిన వైసీపీ మూకలు - తాడిపత్రి ఆర్వో కార్యాలయంలో ఉద్రిక్తత - andhra pradesh elections 2024
Andhra Pradesh Elections 2024: ఎన్నికల వేళ రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నామినేషన్ల పరిశీలన గదిలోకి వేళ్లేందుకు వైసీపీ నాయకులు యత్నించారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. అదే విధంగా పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ శ్రేణులు కప్పింపు చర్యలకు పాల్పడ్డారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 1:57 PM IST
YCP Provoking Activities: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలో ఉరవకొండ తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తరలివచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కాలువపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రచార వాహనాన్ని ఎక్కి ప్రసంగిస్తుండగా, వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రచార వాహనం పక్కనే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జనాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు నిలువరించలేదని మండిపడుతున్నారు.