ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఆమ్రపాలి - సొంత రాష్ట్రంలో బాధ్యతలు

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆమ్రపాలికి బాధ్యతలు

VICE CHANCELLOR AND MANAGING DIRECTOR OF TOURISM
AMRAPALI TOOK CHARGE IN AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Amrapali Took Charge as Managing Director of Tourism: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం ఇటీవల అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు చేశారు. అయితే ఇంతకుముందు తెలంగాణలోనే కొనసాగించాలని ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్ ల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వీరి వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చడం గమనార్హం.

విద్యాభ్యాసం: ఆమ్రపాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. ఆమ్రపాలి తండ్రి అయిన వెంకటరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఈమె తల్లి పేరు పద్మావతి. ఆమ్రపాలి ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖలో జరిగింది. ఆ తర్వాత చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలయ్యారు. తదుపరి IIM బెంగళూరు నుంచి మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టాను సంపాదించారు.

UPSCలో 39 వ ర్యాంక్:ఆమ్రపాలి 2010 వ సంవత్సరపు బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. UPSC పరీక్షల్లో 39వ ర్యాంక్‌ సాధించి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఎందరో యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఐఏఎస్ కు ఎంపికైన అతిపిన్న పిన్న వయస్కులలో ఒకరుగా ఈమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల వేదికగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఆమె కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ వారిని చైతన్యపరిచే వారు.

తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ:తెలంగాణ క్యాడర్‌ అధికారిగా వివిధ జిల్లాల్లో ఈమె బాధ్యతలను నిర్వర్తించారు. అంతేగాక జీహెచ్ ఎంసీ కమిషనర్ గా సైతం బాధ్యతలను స్వీకరించారు. అయితే ఐఏఎస్ ల బదిలీ ప్రాతిపదికన ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. గత నెల అక్టోబర్ 27న ఆమ్రపాలిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ ఛాన్సలర్ గా, ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ విజయవాడలోని పర్యాటక సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పర్యాటకశాఖ ఉద్యోగులు అంతా ఆమ్రపాలిని ఘనంగా స్వాగతించారు.

ఐఏఎస్​పై ఈడీ ప్రశ్నల వర్షం - భూదాన్ భూముల స్కాంలో చిక్కుముడులు వీడినట్టేనా!

స్మితా సభర్వాల్​ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం - Kodandaram fires on Smita Sabharwal

ABOUT THE AUTHOR

...view details