తెలంగాణ

telangana

ETV Bharat / state

వాలంటైన్స్ వీక్ వేళ - అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయితో దూందాంగా పెళ్లి - AP MAN MARRY AMERICAN GIRL

అమెరికా అమ్మాయి - ఆంధ్రా అబ్బాయి - నందిగామలో అంగరంగా వైభవంగా ప్రేమ పెళ్లి

American Girl Married AP Man
American Girl Married AP Man (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 5:03 PM IST

American Girl Married AP Man: ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదంటారు. అది ఒక ఇంద్రజాలం. 2 క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధంలేని తొలి సంబంధమే ప్రేమ. అది ఒక అనిర్వచనీయ మధురానుభూతి. ఆ ప్రేమను నిజంగా మనసు పెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ఆది అంతం లేని అమరానందమే.

అమెరికా అమ్మాయి ఆంధ్రా అబ్బాయి : అలాంటి అపురూపమైన ప్రేమకు దాసులు కానివారు ఎవరుంటారు. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ఈ ప్రేమను ఆస్వాదించే ఉంటారు. అలాంటి అనుభూతిలో తమను తాము మర్చిపోయి కాలం గడపిన వారు ఉన్నారు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నపుడు ప్రేమే జీవరాగం అవుతుంది. అదే జ్ఞానయోగమూ అవుతుంది. 2 హృదయాల్లో సెలయేటిలా పారుతుంది. అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది. తాజాగా వారిది ఊరు కాని ఊరు. దేశం కాని దేశం. ఒకరి భాష మరొకరికి రాదు. అయినా వారి ప్రేమ హృదయాలు కలిశాయి. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఆ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహ విశేషాలు ఎంటో తెలుసుకుందాం పదండీ?

ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన పగిడపల్లి ఆనంద్ గత 15 ఏళ్లుగా అమెరికాలోని నశ్విలేలో ఉంటున్నారు. సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేస్తూ పలు బిజినెస్​లను నిర్వహిస్తున్నారు. అక్కడ టీచర్​గా పని చేస్తున్న అంబర్​తో ఆనంద్​కు పరిచయం అయ్యింది. అలా ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి కొన్ని రోజులకు ప్రేమగా చిగురించింది. ఒకరికొకరు తమ ఇష్టాయిష్టాలను తెలుసుకొని ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

దీంతో నందిగామ శివారులోని ఓ కాలేజీ ప్రాంగణంలో శనివారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. వీరి వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి వివాహ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ వేడుకకు అమెరికా నుంచి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వారి బంధువులు కూడా వచ్చారు. ప్రేమను గెలిపించుకొని వివాహ బంధంతో ఒక్కటవ్వడంతో ఆ జంట ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ఫిన్లాండ్‌ టూ హైదరాబాద్‌ - వయా యాహూ చాట్ ప్రేమ - వ్యాపారంలో రాణిస్తున్న జంట

ABOUT THE AUTHOR

...view details