Ambulance Stalled Due To Heavy Rain :హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఓ రోగికి ప్రాణసంకటంగా మారింది. సాయంత్రం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఇదే సమయంలో కోదాడ నుంచి నిమ్స్ ఆసుపత్రికి ఓ రోగిని తీసుకుని అంబులెన్స్ వస్తోంది. ఈ క్రమంలో మలక్‌పేట రైల్వే బ్రిడ్జి గుండా వస్తుండగా వరదనీరు ఇంజన్‌లోకి చేరడంతో అంబులెన్స్ నీటిలోనే నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ ముందుకు కదలకుండా వరదనీటిలోనే ఉండిపోయింది. అంబులెన్స్ గంటపాటు వరదనీటిలోనే ఉండడంతో అందులో ఉన్న రోగి వేచిచూడాల్సి వచ్చింది. సహయం కోసం 100 డయల్ చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని రోగి కుటుంబ సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో ఉన్న రోగికి ఆక్సిజన్ సమస్య ఏర్పడడంతో వెంటనే వేరే ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్‌లో వాన కష్టాలు - ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్ - Ambulance stalled due to heavy rain - AMBULANCE STALLED DUE TO HEAVY RAIN
Ambulance Stalled Due To Heavy Rain : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తికి ప్రాణసంకటంగా మారింది. భారీ వర్షం పడుతున్న సమయంలో అత్యవసర స్థితిలో ఓ రోగిని కోదాడ నుంచి నిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో మలక్‌పేట బ్రిడ్డి గుండా వస్తుండగా అంబులెన్స్ ఇంజిన్లోకి వరదనీరు చేరడంతో ఆ వాహనం నీటిలోనే ఉండిపోయింది. దీంతో డయల్ 100కు ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో రోగిని ఓ ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Ambulance Stalled Due To Heavy Rain (ETV Bharat)
Published : May 16, 2024, 10:03 PM IST