Anant Ambani Radhika Merchant Wedding Arrangements : దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ సంగతులేంటంటే?
Karimnagar Filigree Gifts For Anant Radhika Wedding Guests: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా దేశంలోనే అరుదైన కళల్లో ఒకటైన కరీంనగర్ ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ఈసారి పెళ్లి వేడుకకు వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన వస్తువులను అంబానీ బహుమతులుగా అందించనున్నారు.
అతిథుల కోసం కరీంనగర్ ఫిలిగ్రీ బహుమతులు :భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జులై 12న జరగనుంది. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల ప్రముఖులు రానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక వివాహ వేడుక అంతకు మించి గ్రాండ్‌గా చేయడానికి రంగం సిద్ధం చేసింది అంబానీ ఫ్యామిలీ. ఇందులో భాగంగా ఇప్పటికే వివాహ వేడుకకు హాజరయ్యే గెస్టుల లిస్ట్ రెడీ చేసింది.
ఇక పెళ్లికి వచ్చే అతిథులకు దేశంలోనే అరుదైన కళల్లో ఒకటైన కరీంనగర్ ఫిలిగ్రీతో చేసిన వస్తువులు బహుమతులుగా ఇవ్వాలని అంబానీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 400 వస్తువులకు ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్, తదితర వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు.
Anant Ambani Wedding : అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు. ప్రతిదీ అట్టహాసంగా జరుగుతుంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా పెళ్లి వేడుక కూడా అలానే జరగనుంది. అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ని పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది జనవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత ఈ ఏడాది మేలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆహారం కోసమే దాదాపు 300 కోట్లు ఖర్చు చేశారు. ఇక అసలు సిసలైన పెళ్లి జులైలో జరగనుంది. ఈ పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాల నుంచి అతిథుల కోసం ఆకర్షనీయమైన బహుమతులు సిద్దం చేస్తున్నారు.