Allu Arjun Responded On Sandhya theatre issue :పుష్ప 2’ ప్రీమియర్ వేళ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
బాధితురాలి కుటుంబం కోసం తాను ఉన్నాననేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రేవతి పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజకు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా అల్లు అర్జున్ ఎక్స్‌లో ప్రకటించారు.
"రేవతి చనిపోవడం మా టీంను తీవ్రంగా కలచివేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మెయిన్ థియేటర్‌లో సినిమాలు చూడటం 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ ఇలా జరగలేదు. రేవతి చనిపోయిన విషయం తెలిశాక పుష్ప విజయోత్సవాలు చేసుకోలేకపోయాము. మేం సినిమా తీసేదే జనాలు థియేటర్‌కు వచ్చి ఆనందించడానికి. థియేటర్ వద్ద ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించింది. మేం ఏం చేసినా, ఎంత మాట్లాడినా రేవతిని తిరిగి తీసుకురాలేం. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆమె కుటుంబానికి అండగా ఉంటాం. ప్రేక్షకులు జాగ్రత్తగా వచ్చి సినిమాలను ఆస్వాదించండి"- అల్లు అర్జున్, హీరో
'సంధ్య థియేటర్' ఘటన - స్పందించిన బన్నీ టీమ్ - ఏమందంటే?
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్‌పై కేసు నమోదు