Alliance Leaders Election campaign in AP :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.చిత్తూరు జిల్లా నగరిలో తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మెుదలియార్ సామాజిక వర్గీయులతో కలిసి సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో అనేక అరాచకాలు జరిగాయని ఎన్నికల్లో వారిని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Visakha District :విశాఖ జిల్లా పద్మనాభం మండలం నేరెళ్లవలస నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ,ఎంపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చిన్నాపురం వైకాపా నుంచి 20 కుటుంబాలు గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి
వేడెక్కిన రాజకీయాలు - ఓవైపు ప్రచార హోరు, మరో వైపు వలసల జోరు - ELECTION CAMPAIGN IN AP
Prakasam District : ప్రకాశం జిల్లా అలవలపాడు, పొట్లపాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 'ఇంటింటికి మంచినీటి కుళాయి' కార్యక్రమం చేపడుతామని హామీ ఇచ్చారు.
NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం అభ్యర్థులు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.సూపర్‌సిక్స్ పథకాలు నచ్చి రోజు రోజుకు తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయని కేశినేని చిన్ని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామనీ హామీ ఇచ్చారు.
విజయవాడ తూర్పు నియోజక వర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహన్ విస్తృతంగా పర్యటించారు. రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి ఒక పథకం లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన సంఘీభావంగా గద్దె అనురాధ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాంగా పాల్గొన్నారు. కూటమి విజయానికి ఓటర్లందరూ కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తిరువూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికిపుడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓటర్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.