Airbus Flights Operations Begin At Rajahmundry To Mumbai :రాజమహేంద్రవరం నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా రాజమండ్రి -ముంబయి ఎయిర్‌బస్ విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం నుంచి 114 మంది ప్రయాణికులతో రాత్రి ఆదివారం రాత్రి 9 గంటలకు విమానం టేకాఫ్ అయింది. అలాగే ముంబయి నుంచి 173 మంది ప్రయాణికులతో వచ్చిన మరో విమానానికి ఎయిర్ పోర్టు సిబ్బంది రన్‌వేపై వాటర్ కెనాన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు.
ప్రయాణికులకు స్వాగతం : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎయిర్‌బస్ రావడం ఇదే మొదటిసారి. రాజమండ్రి నుంచి ఎయిర్‌బస్ విమాన సర్వీసులు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అలాగే రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితర ముఖ్య అతిథులతో పాటు ఏపీడీ జ్ఞానేశ్వరరావు విమానశ్రయంలోని టెర్మినల్ భవనం వద్ద నిల్చొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. అంతకుముందు వీరంతా జ్యోతి ప్రజ్వలన చేశారు.
కడప వాసులకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణ