Agriculture Degree Spot Counseling at Jayashankar Agricultural University :వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ (ఫిషరీస్) డిగ్రీ కోర్సుల్లో జనరల్, ప్రత్యేక కోటాలో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ జరగనుంది.
విద్యార్థులకు గుడ్ న్యూస్ - అగ్రికల్చర్ డిగ్రీ స్పాట్ కౌన్సెలింగ్ - ఎప్పుడంటే? - AGRICULTURE DEGREE SPOT COUNSELING
వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ (ఫిషరీస్) డిగ్రీ కోర్సుల్లో జనరల్, ప్రత్యేక కోటాలో ఖాళీ సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్
Published : Jan 4, 2025, 5:44 PM IST
PJTSAU Spot Counseling on January 6th : జనరల్ కోటాలోని సీట్ల భర్తీ కోసం సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. అదే విధంగా ప్రత్యేక కోటాలోని సీట్ల భర్తీ కోసం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆడిటోరియంలోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శివాజి తెలిపారు. ఎప్‌సెట్-2024లో ర్యాంకులు పొంది ఇది వరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. వివిధ కోర్సుల్లోని సీట్ల ఖాళీలు, ఫీజులు వంటి ఇతర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.pjtsau.edu.inలో చూడవచ్చని రిజిస్ట్రార్ సూచించారు.