After Btech Higher Studies or Job Which is Better :చాలా మంది విద్యార్థులు బీటెక్ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. మాస్టర్స్ చేయాలా లేక ఉద్యోగం చేయాలా అన్న ప్రశ్నవారి మొఖంలో కనిపిస్తుంది. అలాంటి వారికి నిపుణులు ఏం చేప్తున్నారంటే.. బీటెక్ చివరి ఏడాది చదువుతున్నారంటే అప్పటికే కెరియర్ గురించి ఒక నిర్ణయానికి రావాలి. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం మొదట్లోనే బీటెక్ తరువాత ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎంటెక్ చేయాలా? ఉద్యోగం చేయాలా అన్నది వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.
ఎంటెక్ చేయాలి అనుకుంటే గేట్ 2025 రాసి మంచి ర్యాంకు సాధించాలి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లోలాంటి వాటిల్లో ప్రవేశం పొందాలి. ప్రస్తుతుం మీరు చదువుతున్న బీటెక్ కాలేజీ కంటే మెరుగైన ర్యాంకున్న ఎంటెక్ కాలేజీని ఎంచుకోవాలి. అప్పుడే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ ఎంఎస్ చేసే ఆలోచనలో ఉంటే ఐఈఎస్‌టీఎస్/ టోఫెల్, జీఆర్‌ఈ లాంటి పరీక్షలు రాయాలి. వీటిలో మంచి స్కోరు సాధిస్తే విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తోంది. ఎంటెక్/ ఎంఎస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ లాంటి సబ్జెక్టులు చదివే అవకాశముంటుంది.
బీటెక్ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్ - మేనేజ్మెంట్ సీట్లపై సర్కార్ కీలక నిర్ణయం?