తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సీటు - జోరందుకున్న రాజకీయ వలసలు - Adilabad Lok Sabha Polls 2024

Adilabad Lok Sabha Polls 2024 : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చేరికల కారణంగా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థులు ఎవరన్న విషయం కొలిక్కి రావడం లేదు. ఉత్కంఠను రేకెత్తిస్తున్న బీజేపీ ఎంపీ టికెట్‌ పంచాయతీ దిల్లీకి చేరింది. గెలుపు గుర్రం కోసం కాంగ్రెస్‌ అన్వేషిస్తుంటే ఓటమితో నైరాశ్యానికి లోనైన బీఆర్​ఎస్​ కీలకనేతలు పార్టీని వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

All parties Focus on Adilabad MP Seat
Telangana All parties Focus on Adilabad MP Seat

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 9:45 AM IST

ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సీటు జోరందుకున్న రాజకీయ వలసలు

Adilabad Lok Sabha Polls 2024 :పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ ఇంకా విడుదల కాకముందే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం అనూహ్యా పరిణామాలకు దారి తీస్తోంది. బీఆర్​ఎస్​కు చెందిన ఆదిలాబాద్‌, మంచిర్యాల జడ్పీఛైర్మెన్లు జనార్దన్‌ రాఠోడ్‌, నల్లాల ఓదెలు దంపతులు ఇప్పటికే పార్టీని వీడగా, తాజాగా సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడైన ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జీ జడ్పీఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఈనెల 14న కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారైంది. బీఆర్​ఎస్​ నుంచి బోథ్‌ ఎమ్మెల్యే టికెట్‌, ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ గోడం నగేష్‌ ఆదివారం బీజేపీలో చేరారు.

మరోపక్క కీలకనేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (BRS Leader Indrakaran Reddy) , ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరడానికి అంతర్గతంగా మంతనాలు జరుగుతుండటం బీఆర్​ఎస్​ రాజకీయ ప్రభవాన్ని మసకబారేలా చేస్తోంది. ప్రధానంగా ఎన్నికల పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్​, బీజేపీతో మంతనాలు జరుపుతుండడంతో బీఆర్​ఎస్​పై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది.

BJP Leaders Focus on Adilabad MP Seat : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన బీజేపీ కీలకనేతల బృందం హుటాహుటిన సోమవారం దిల్లీబాట పట్టారు. బీఆర్​ఎస్ (BRS)​ నుంచి వచ్చిన గోడం నగేష్‌కు టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ సీనియర్‌నేత బీఎల్‌ సంతోష్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ సహా ఇతర కీలకనేతలను కలవడం కలకలం రేకెత్తిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అప్పటి ఎంపీగా ఉన్న గోడం నగేష్‌ భైంసా మున్సిపాల్టీ కో-ఆప్షన్‌ సభ్యుడిగా ఎంఐఎంకి ఓటేశారని బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకురావడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి : హరీశ్‌రావు

ఓ దశలో గోడం నగేష్‌ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యం పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేకెత్తిస్తోంది. ఎంపీగా నగేష్‌ అభ్యర్థిత్వాన్ని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ బలపరుస్తుంటే, అదే పార్టీకి చెందిన బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు సీటు గురించి ఒకే వ్యక్తిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. దీంతో సీటు ఖరారు విషయం దిల్లీ చేరింది.

Congress on Lok Sabha Election Plan 2024 :బీజేపీ, బీఆర్​ఎస్​లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా డబుల్​ డిజిట్​ దిశగా హస్తం నేతలు వ్యూహాన్ని రచిస్తున్నారు. శాసనసభ ఎన్నికల ముందు దూరమైన శ్రేణులతోపాటు బీఆర్​ఎస్​లోని కీలకనేతలను పార్టీలో చేర్చుకోవడానికి (Congress Joinings) పావులు కదుపుతూనే బలాన్ని పెంచుకునే ప్రణాళికతో ముందుకెళ్తోంది.

తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్​ షా రాకతో కొత్త జోష్!

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం - కొనసాగుతోన్న ఫ్లాష్​​ సర్వేలు

ABOUT THE AUTHOR

...view details