Police Seized 290 Kg Cannabis Being Transported In A Lorry Tanker : పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలించే సీన్ మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ప్లాన్‌నే గంజాయి స్మగ్లర్లూ అమలు చేశారు. కాకపోతే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ సంఘటన పుష్ప సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్‌ను గుర్తు చేసింది.
అనుమానాస్పదంగా లారీ డ్రైవర్ : కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం పోలీసుల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్ లారీలో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టామని వివరించారు.
గాంజా రవాణాపై విజయనగరం పోలీసులు సీరియస్- పీడీ యాక్ట్ నమోదుకూ సిద్ధం - Police to control marijuana
290 కిలోల గంజాయి స్వాధీనం : ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 290 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీని విలువ రూ.72.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అక్కడే డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను అరెస్టు చేశామన్నారు. త్వరలో ప్రధాన నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అలాగే గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ సరఫరా అవుతోందీ, దీని వెనకున్న సూత్రధారులు ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గంజాయి పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
Drugs Caught in Guntur: కొద్దిరోజుల క్రితమే బెంగళూరు నుంచి గుంటూరు, హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఎఈడీ బల్బ్‌లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బల్బ్‌లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టి డ్రగ్స్‌ను సీజ్ చేశామని వివరించారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న యూసఫ్, డోనాల్డ్ (టోనీ)లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అన్నారు.
'గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల బారి నుంచి మా కాలనీని కాపాడండి' - Ganjai Blade Batch in Vijayawada
ఆ ఇళ్లలో అసాంఘిక కలాపాలు- మద్యం, గాంజా మత్తులో బెదిరింపులు - VIJAYAWADA JNNURM HOUSES