Jagapathibabu Post About Revathi Family :సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఇప్పటికే ఆ బాధిత కుటుంబాన్ని తాను కలిసి పరామర్శించానని సినీ నటుడు జగపతిబాబు తెలిపారు.
సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించట్లేదంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దానిపై సినీ నటుడు జగపతి బాబు తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియో విడుదల చేశారు. సినిమా షూటింగ్ ముగించుకుని తాను ఊరి నుంచి రాగానే హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి తండ్రిని, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లానని జగపతి బాబు తెలిపారు. అందరి ఆశీస్సులతో బాలుడు త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చానని తెలిపారు. అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ అని, తన వంతుగా సపోర్ట్ ఇవ్వాలనుకున్నానని వివరించారు. దానిని పబ్లిసిటీ చేయలేదని తెలిపారు. అందుకే ఎవరికీ ఈ విషయం తెలియదన్న జగపతిబాబు, దానిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టు అని వెల్లడించారు.