తెలంగాణ

telangana

ETV Bharat / state

గజానికి రూ.81 వేల పరిహారం - పాతబస్తీ మెట్రోకు ఆస్తుల సేకరణ షురూ - ACQUISITION PROPERTY METRO PHASE 2

పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులు ప్రారంభం - ఆస్తుల సేకరణ ప్రారంభించిన అధికారులు - గజానికి రూ.81 వేలు పరిహారమిస్తున్న మెట్రో

Acquisition of Properties in Old City for Metro Expansion
Acquisition of Properties in Old City for Metro Expansion (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 12:10 PM IST

Hyderabad Metro Phase 2 Expansion :పాతబస్తీలో మెట్రో మార్గంలో రహదారి విస్తరణకు ఆస్తుల సేకరణ మొదలైంది. గజానికి రూ.81 వేలను పరిహారంగా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ముందుకొచ్చే నిర్వాసితులకు త్వరలోనే పరిహారం కింద చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఆస్తుల కూల్చివేత, రహదారి విస్తరణ పనుల ప్రక్రియ మొదలుపెడతామని వివరించారు.

ఇప్పటికే కొందరు యజమానులు తమ అంగీకార పత్రాలను సమర్పించారని, వారికి 10 రోజుల్లోగా చెక్కులు అందిస్తామని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో విస్తరణ కోసం 1100 ఆస్తులను సేకరించాలన్నారు. మెట్రో రైలు సెకండ్‌ ఫేజ్‌ 76.4 కి.మీ మార్గాల ప్రతిపాదనలను కేంద్రానికి పంపించామన్న ఆయన, అనుమతి రాగానే పనులు మొదలు పెడతామని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తారని తెలిపారు.

ఒప్పంద పత్రాలను చూపుతున్న ఎన్వీఎస్‌రెడ్డి, పవన్‌దీప్‌ సింగ్‌ తదితరులు (ETV Bharat)

ర్యాపిడోతో ఒప్పందం :మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో గుమ్మం నుంచి గమ్యం దాకా (ఫస్ట్‌ అండ్‌ లాస్ట్ మైల్‌ కనెక్టివిటీ) సేవలు అందించేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలుతో ర్యాపిడో శనివారం కాంట్రాక్ట్ చేసుకుంది. గ్రీన్‌ ల్యాండ్స్‌లోని ఒక హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెట్రో లైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. నగర అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణాతో పాటూ గుమ్మం నుంచి గమ్యం దాకా సేవలు చాలా ముఖ్యమన్నారు. ర్యాపిడో, స్విధ, టీఎస్‌ ఆర్టీసీ, ఇతర మొబిలిటీ సంస్థల ద్వారా లక్ష మంది గుమ్మం నుంచి గమ్యం దాకా సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ర్యాపిడో ఒక్క సంస్థే నిత్యం 45 వేల రైడ్‌లను వేస్తోందని, ఈ సంఖ్య 2 లక్షలకు పెంచాలని, మహిళల కోసం ఉమెన్‌ రైడర్లు ఎక్కువ మందిని నియమించామని నిర్వాహకులు తెలిపారు.

ఈ ఏడాదిలో ర్యాపిడో కోటి మెట్రో రైడ్‌లను పూర్తి చేసిందని ర్యాపిడో చీఫ్ మార్కెటింగ్ అధికారి పవన్‌దీప్‌ సింగ్‌ అన్నారు. 57 మెట్రో స్టేషన్లలోని నాలుగు వైపులా తమ సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రస్తుతం హైదరాబద్‌లో రోజువారీ 2.7 లక్షల రైడ్‌లు జరుగుతున్నట్లు చెప్పారు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సీవోవో మురళీ వరదరాజన్‌, చీఫ్ మార్కెటింగ్‌ అధికారి రిషివర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

5 కి.మీ నాగోల్​ - ఎల్బీనగర్​ మెట్రో లింక్​కు ప్రాధాన్యం​ - ఇది పూర్తయితే సాఫీ ప్రయాణమే

ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతాం : ఎన్వీఎస్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details