ETV Bharat / state

ఈదులకుంట దొరికేసిందోచ్ - ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టిన హైడ్రా - HYDRA DISCOVERED EDULAKUNTA LAKE

సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఈదులకుంటను గుర్తించిన హైడ్రా - ఎన్‌-కన్వెన్షన్‌ కూల్చివేత సందర్భంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు

HYDRA IN EDULAKUNTA LAKE
ఈదులకుంట వద్ద సర్వే చేస్తున్న అధికారులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 1:07 PM IST

Edulakunta Lake in Hyderabad : ప్రభుత్వ రికార్డుల్లో కనిపించకుండా పోయిన హైదరాబాద్​లోని ఈదులకుంట చెరువు ఆచూకీ ఎట్టకేలకు హైడ్రా గుర్తించింది. కూకట్‌పల్లి, ఖానామెట్‌ గ్రామాల మధ్య ఆ కుంట గతంలో సుమారుగా 7 ఎకరాల్లో విస్తరించి ఉండేది. తుమ్మిడికుంట ఆక్రమణల్లో చిక్కుకుపోవడం, రోడ్డు విస్తరణ, పైవంతెన నిర్మాణ పనులతో వరద కాలువ మూసుకుపోవడంతో ఈదులకుంటలో చేరాల్సిన వరద, అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీల్లోకి మళ్లింది. దీంతో ఈదులకుంట భూమికి మంచి డిమాండ్​ ఏర్పడింది.

ఖాళీగా కనిపించింది, కన్ను పడింది : అదే అదనుగా కొందరు ఈ కుంటపై కన్నేశారు. ఈ క్రమంలో కొందరు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, బల్దియా అధికారులతో చెరువును రికార్డుల్లో లేకుండా మార్పులు చేయించారు. గతంలోనే దీనిపై వివిధ వార్తా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. ఇటీవల హైడ్రా మాదాపూర్​లోని తుమ్మిడికుంట వద్ద ఎన్‌-కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన సందర్భంగానూ ఈదులకుంట కనిపించకుండా పోయిన ఉదంతంపై కథనాలు వచ్చాయి.

త్వరలోనే పునరుద్ధరణ : వార్తా పత్రికల్లో వరుస కథనాలు, స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రంగంలోకి దిగారు. నేషనల్​ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం పటాలు, సర్వే ఆఫ్‌ ఇండియా ట్రోపో చిత్రాలను పరిశీలించారు. వాటిలో ఈదులకుంట పరిసర ప్రాంతం ఆనవాళ్లు దొరికాయి. వాటి ఆధారంగా అధికారులు గురువారం (జనవరి 2) చెరువును సర్వే చేసి హద్దులను నిర్ధారించారు. త్వరలోనే ఈదులకుంట చెరువు పునరుద్ధరణ పనులు మొదలవుతాయని హైడ్రా అధికారులు తెలిపారు.

నిబంధనలు పాటిస్తూనే ఆక్రమణలు కూల్చివేశాం : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్

నోటీసులిచ్చి 24 గంటలు గడవలేదు, వారి వివరణ తీసుకోలేదు - హైడ్రా కూల్చివేతలపై​ హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.