ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డొల్ల కంపెనీలకు నిధుల మళ్లింపు - సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు - CASE ON FORMER CID CHIEF SANJAY

సీఐడీ మాజీ డీజీ ఎన్.సంజయ్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ - సంజయ్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన సీఎస్‌

ACB Registers case Against Former CID Chief Sanjay
ACB Registers case Against Former CID Chief Sanjay (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 24 hours ago

ACB Registers case Against Former CID Chief Sanjay :వైఎస్సార్సీపీతో అంటకాగిన సీఐడీ మాజీ డీజీ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పని చేసిన ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సంజయ్‌పై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సీఎస్‌ నీరబ్​ కుమార్ నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదు అయ్యింది. ఇటీవలే సంజయ్‌ను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఏ1గా సంజయ్‌, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

రెండు వేరు వేరు నివేదికలు :'అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (NOC)లు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు ఎన్.సంజయ్‌ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారు. సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చి, 1.19 కోట్ల రూపాయలు చెల్లించారు.

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు

సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్‌ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారు' అని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రభుత్వానికి 2 వేరు వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

రెండు కంపెనీలు ఒకే చిరునామా ? : సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ సంస్థల ఖాతాల్లో జమ అయిన డబ్బు ఎవరు విత్‌డ్రా చేశారు? అంతిమంగా ఎవరి వద్దకు చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది. క్రిత్వ్యాప్, సౌత్రికా 2 ఒకే చిరునామాలో ఉన్నాయని, క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ డొల్ల కంపెనీ అని విజిలెన్స్‌ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనక ఎవరు ఉన్నారు? ఎందుకు ఏర్పాటు చేశారు? నిధులు ఎలా పక్కదారి పట్టించారనేదానిపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించనున్నారు.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ - 'సంజయ్‌' డొల్ల కంపెనీల గుట్టురట్టు

ABOUT THE AUTHOR

...view details