ACB Notices to Ace Next Company in Hyderabad :ఫార్ములా -ఈ కేసు వ్యవహరంలో ఏసీబీ మరో ముందడుగు వేసింది. ఎస్ నెక్ట్స్ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి ఒప్పందం చేసుకుని ఉన్నట్టుండి ఎస్ నెక్ట్స్ అనే కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అప్పట్లో వైదొలగింది. ఈ నెల 18న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది.
ముగ్గురి విచారణ పూర్తి : ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఫార్ములా ఈ- కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిందని పలువురు చర్చించుకుంటున్నారు.
2022 అక్టోబరు 25న జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం సీజన్ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్స్ట్‌జెన్ భరిస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్-9 ఫార్ములా ఈ-రేస్ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్-10 రేస్ కోసం ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థకు 2023 మేలోనే 50 శాతం సొమ్ము (రూ.90 కోట్లు) చెల్లించాల్సి ఉండగా ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ ముందుకు రాలేదు.