తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏసీబీ పేరుతో బెదిరింపులా? - అయితే మాకు చెప్పండి' - ACB DIRECTOR GENERAL ON FRAUD CALLS

ఏసీబీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై డీజీ స్పందన - నకిలీ ఫోన్‌ కాల్స్‌ను నమ్మవద్దని విజ్జప్తి చేసిన డీజీ విజయ్​ కుమార్ - జాగ్రత్త వహించాలని ప్రభుత్వ ఉద్యోగులకు సూచన

ACB Director General On Fraud calls
ACB Director General On Fraud calls (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 6:21 PM IST

ACB Director General On Fraud calls :అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేరుతో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై ఏసీబీ డైరెక్టర్​ జనరల్ ​(డీజీ) విజయ్‌ కుమార్‌ స్పందించారు. ఏసీబీ పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్‌ చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని డీజీ విజయ్ ​కుమార్​ తెలిపారు. ఉద్యోగులపై కేసులు లేకుండా చూస్తామంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. ఎవరైనా ఏసీబీ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లయితే ఏసీబీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త వహించాలని విజయకుమార్​ సూచించారు. నకిలీ ఫోన్​కాల్స్​ను నమ్మవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.

"ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఏసీబీ, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీపై కేసు లేకుండా చూస్తామంటే ఏసీబీకి ఫిర్యాదు చేయాలి"- విజయ్​ కుమార్​, ఏసీబీ డీజీ

ABOUT THE AUTHOR

...view details