ACB Arrested Tribal Welfare EE Jaga Jyothi : ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతి నాంపల్లి ఏసీబీ (ACB) అధికారులు కోర్టులో హాజరు పర్చారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆమెను చంచల్గూడ మహిళ జైలుకు తరలించారు. రెండురోజుల క్రితం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ జగజ్యోతి ఏసీబీకి చిక్కింది.
సోదాల సమయంలో అస్వస్థతకు గురైన జగజ్యోతిని ఉస్మానియాలో చికిత్స పొందారు. నిన్నంతా పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్యంగానే ఉందని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. అనంతరం జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జగజ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు 3.6 కిలోల బంగారు నగలు, 65.50 లక్షల నగదు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈఈ జగజ్యోతి అరెస్ట్ - రూ.64 లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
Tribal Welfare EE Jaga Jyothi : ప్రస్తుతం ఏసీబీ అధికారులు జగజ్యోతి ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో ఆమె ఇంట్లో డబ్బు, నగలతో పాటు భారీగా డాక్యుమెంట్లు దొరికాయి. ఇప్పుడా డాక్యుమెంట్ల విలువను అంచనా వేస్తున్నారు. అందుకోసం ఆయా రిజిస్ట్రర్ ఆఫీసులను సంప్రదిస్తున్నారు. అక్కడే లభించే సమాాచారంతోనే ఆమె ఆస్థుల మొత్తం విలువ తెలుస్తుంది.