Abhishek Boinpally Granted Interim Bail :దిల్లీ మద్యం కేసులో అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న అభిషేక్ భార్యకు చికిత్స చేయించేందుకు బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం, తదుపరి విచారణ ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని తెలిపింది.
పాస్‌పోర్టు సరెండర్ చేయాలని అభిషేక్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అతడు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దిల్లీ మద్యం కేసులో 2022 నవంబర్ 13వ తేదీన అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 19 నెలలుగా జైలులో ఉన్న అతడికి తాజాగా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Delhi Liquor Scam Updates :దిల్లీ మద్యం కుంభకోణంలో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయని, వాటి పంపిణీలో బోయినపల్లి అభిషేక్ కీలక పాత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలోనే తేల్చేసింది. దక్షిణాది సిండికేట్ నుంచి వచ్చిన మొత్తాన్ని సమకూర్చడంలో, పంపిణీకి ప్రణాళిక వేసిన వారిలో విజయ్‌నాయర్ కీలకమని పేర్కొన్న ఈ డీ, ఆ మొత్తంలో అభిషేక్ రూ.30 కోట్లు హవాలా రూపంలో తీసుకు రాగా, మిగతా సొమ్మును దిల్లీలో సర్దుబాటు చేశారని తెలిపింది.
ఆప్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారు : ఈడీ
అభిషేక్ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే సమాచారం సేకరించాయి. ఆయనకు పలు సంస్థల్లో భాగస్వామ్యం ఉందని నిర్ధారించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్‌లోనూ అప్పట్లో సోదాలు జరిగాయి. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులతో వ్యాపార భాగస్వామ్యం ఉందని, అతని తరఫున అభిషేక్ కీలకపాత్ర పోషించాడని బయటపడింది. దక్షిణాదికి చెందిన అనేక మద్యం సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు కూడగట్టారని ఈడీ పేర్కొంది.
MLC Kavitha Arrest Updates :మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా, 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. సౌత్ గ్రూప్‌నకు చెందిన కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారని తెలిపింది మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు లంచం రూపంలో రూ.100 కోట్లు సమర్పించడం సహా, రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పిటిషన్‌లో వెల్లడించింది.
దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం