ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో కామాంధుల అకృత్యం - మహిళను ఆటోలో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం - GANG RAPE IN NIZAMABAD

బస్టాండ్ వద్ద మహిళను ఆటో ఎక్కించుకున్న నలుగురు దుండగులు - డిచ్​పల్లికి తీసుకెళ్లి అత్యాచారం

Gang Raped in nizamabad
Gang Raped in nizamabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 5:36 PM IST

Gang Raped in Nizamabad :తెలంగాణ రాష్ట్రంనిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లి ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం (అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు.

అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు : బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్​లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.

వరుస ఘటనలతో కలవరం : 20 రోజుల క్రితం వరంగల్‌లో కూడా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె నమ్మిన స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడే పని ఉంది రావాలంటూ కారులో ఎక్కించుకొని వరంగల్​లోనే ఓ హోటల్​కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

అలాగే వైఎస్సార్​ జిల్లా బద్వేలులో ఇంటర్‌ విద్యార్థినిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిపై విగ్నేష్ అనే వ్యక్తి పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కొందరు మహిళలు గుర్తించి విద్యార్థినిని రక్షించి పోలీసులకు సమాచారం అందిచారు. అమ్మాయిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కడప రిమ్స్ తరలించారు.

ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం - పోలీసుల అదుపులో నిందితులు

"అత్తా కోడళ్లపై అత్యాచారం" కేసు - 48గంటల్లో ఛేదించిన పోలీసులు - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

ABOUT THE AUTHOR

...view details