A Tech Company In China Encouraging Employees To Fall in Love :ఆఫీసుకెళ్లి మీరు చేయాల్సిన పని ప్రేమలో పడటం. దానికి సంస్థే డబ్బులు కూడా చెల్లిస్తుంది. ఇలా చేస్తే అంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉందా చెప్పండి. చైనాలోని ఓ టెక్ సంస్థ తమ ఉద్యోగులకు అచ్చం ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తుంది. డబ్బులిచ్చి మరీ రిలేషన్‌షిప్‌లోకి దిగమని ప్రోత్సహిస్తోంది. ఈ టెక్ కంపెనీ తాజాగా ఓ సరికొత్త డేటింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఉద్యోగులు బయటి నుంచి సింగిల్స్‌ను తీసుకొచ్చి సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేయించాలి. అలా ఒక్కో సింగిల్‌కు రూ.770 చొప్పున సంస్థ సదరు ఉద్యోగికి చెల్లిస్తోంది. అంతేకాదు రిజిస్టర్ చేసుకున్న వారిలో ఎవరైనా ఉద్యోగులకు నచ్చి, కనీసం మూడు నెలల పాటు రిలేషన్‌లో ఉంటే ఉద్యోగికి, ఆ సింగిల్‌కు, తనను ప్లాట్‌ఫాంలో చేర్పించిన ఉద్యోగికి ఒక్కొక్కరికి రూ.11,700 చొప్పున రివార్డు ఇస్తారట.
గర్వంగా చెబుతున్న యజమానులు : ఈ ప్రయత్నం మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే దాదాపు 500 వరకు సింగిల్స్ నమోదు చేసుకున్నారని యజమానులు గర్వంగా చెబుతున్నారు. ఇందులో గర్వం ఏముంది? అని అనిపింది కావచ్చు. కానీ చైనాలో జననాల రేటుతో పాటు పెళ్లిళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఇటీవల అక్కడి ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో 4.74 మిలియన్ల వివాహాలు నమోదు కాగా, గతేడాది రిజిస్టరైన 5.69 మిలియన్లతో పోలిస్తో ఈ ఏడాది 16.6 శాతం తగ్గినట్లు వెల్లడిస్తున్నాయి. 2022లో ప్రతి వెయ్యి మందికి సగటున 6.77 జననాలు నమోదైతే 2023లో అది 6.39కి తగ్గింది.
మీ భాగస్వామిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త! - How to Leave Toxic Relationship