ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల జిల్లాలో ప్రైవేట్​ నర్సింగ్​ కళాశాల బస్సు దగ్ధం

బాపట్ల జిల్లాలో ప్రైవేటు కాలేజ్ బస్సులో చెలరేగిన మంటలు.. విద్యార్థులను హుటాహుటిన కిందకి దించేయడంతో తప్పిన ప్రమాదం

FIRE ACCIDENT IN CHERUKUPALLI
FIRE ACCIDENT IN CHERUKUPALLI AT BAPATLA DISTRICT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 10:17 AM IST

Fire Accident in College Bus:బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్​ కాలేజ్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమ్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రం గుంటూరు అవ్వడంతో 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు యాజమాన్యం కాలేజ్ బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం అయ్యి బస్సును వెంటనే ఆపేశారు. విద్యార్థులను హుటాహుటిన కిందికి దించివేసిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయ్యింది.అప్పటికే మరొక వాహనంలో ఎక్కిన విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లిపోయారు. స్థానికులు ఫైర్ ఇంజన్​కు సమాచారం ఇచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రైవేటు కాలేజ్ బస్సుల్లో తప్పని సరిగా మంటలు ఆర్పేందుకు ఫైర్ కిట్​లు ఉండాలి. రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించడం వలన కాలేజ్, స్కూల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.

ABOUT THE AUTHOR

...view details