తెలంగాణ

telangana

ETV Bharat / state

కిచెన్​లో ప్రసవం - పండంటి మగబిడ్డ జననం - దుర్వాసన వస్తుందని చూస్తే! - A PREGNANT WOMAN DEATH IN KITCHEN

వంట గదిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ - తల్లీబిడ్డా ఇద్దరూ మృతి - ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో వెలుగులోకి

VIJAYAWADA DEATH CASE
A PREGNANT WOMAN DEATH IN KITCHEN (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 1:36 PM IST

Vijayawada Death Case : ఊళ్లలో పక్కింటి వాళ్లు రెండ్రోజులు ఊరెళ్తే ఏదో తెలియని వెలితి ఉంటుంది. వారితో రోజు మాట్లాడటం అలవాటుగా మారి మనసంతా వారిపైకి వెళ్లిపోతుంది. అలా ఉంటాయి మరి గ్రామాల్లో ఆప్యాయతలు, అనుబంధాలు. కానీ పట్టణాలు, నగరాల్లో పక్కింటివారితో మాట ముచ్చట చాలా తక్కువగా ఉంటుంది. వారు ఏదైనా ఊరుకెళ్తే వారి ఇంటిపైకి చూసేవారు చాలా తక్కువ. ఈ రోజుల్లో పక్కింట్లో మనిషి రోజుల తరబడి బయటకు రాకపోయినా పట్టించుకునే వాళ్లే కరవయ్యారు. నాలుగు గోడల మధ్య ఎవరి జీవితాలు వాళ్లవే అన్నట్లుగా పట్టణాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఆఖరికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తినా పట్టించుకునే వారే లేరు. ఇలాంటి ఘటనే విజయవాడలో జరిగింది.

అసలేం జరిగిందంటే : ఏపీలోని నంద్యాలకు చెందిన చింతా నాగరాజు (30) విజయవాడ విద్యాధరపురంలో ఉంటున్నారు. అతని మొదటి భార్య విజయరాణి అనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందారు. దీంతో నాగరాజు బతుకుదెరువు నిమిత్తం 2017వ ఏటా విజయవాడలో దుర్గాఘాట్ వద్ద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే పని చేసే పొదిలి సమ్మక్క (36)తో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. వీరి పరిచయం కాస్తా ఇష్టంగా ఏర్పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.

కాళ్ల పారాణి ఆరకముందే కాటేసిన కాలం - ఉన్నట్టుండి నవ వధువు మృతి

దీంతో నాగరాజు, సమ్మక్క 2021లో వివాహం చేసుకొని రావిచెట్టు సెంటర్ వద్ద నివాసముంటున్నారు. కాలం గడుస్తుంది. ఈ క్రమంలో సమ్మక్క గర్భివతి అయింది. ఈ నెల (నవంబర్) 19న ఉదయం 5 గంటలకు నాగరాజు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమ్మక్క గుంటూరు వెళ్తానని చెప్పడంతో ఆ రోజు నుంచి నాగరాజు ఇంటికి వెళ్లకుండా దుర్గాఘాట్ వద్దనే ఉన్నాడు. శుక్రవారం (నవంబర్ 22) ఇంటి పక్కన ఉండే వాళ్లు నాగరాజు వద్దకు వచ్చి మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని చెప్పారు.

Women and child death in kitchen room :వెంటనే నాగరాజు ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడగా వంట గదిలో సమ్మక్క మగ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయి ఉంది. శిశువు కూడా ప్రాణాలతో లేదు. దీంతో భవానీపురం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని తల్లి, బిడ్డల మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లీబిడ్డలది సహజ మరణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదుకిడ్నీ దానం చేసిన తల్లి - అయినా బతకని కొడుకు - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details