తెలంగాణ

telangana

ETV Bharat / state

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం - ముగ్గురికి గాయాలు, పదికి పైగా వాహనాలు దగ్ధం - FIRE ACCIDENT IN HYDERABAD

హైదరాబాద్​ అబిడ్స్‌ పరిధిలోని బొగ్గులకుంటలో అగ్నిప్రమాదం - బాణాసంచా దుకాణంలో భారీగా ఎగిసిపడిన మంటలు - పక్కనున్న హోటల్‌కు వ్యాపించిన మంటలు - పదికి పైగా వాహనాలు దగ్ధం - ఓ మహిళకు గాయాలు

FIRE ACCIDENT IN ABIDS
FIRE ACCIDENT AT BOGGULKUNTA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 10:08 PM IST

Updated : Oct 28, 2024, 7:41 AM IST

Massive Fire Accident at Abids in Hyd : నగరంలోని దీపావళి టాపాసుల దుకాణంలో నిప్పురవ్వలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గంటన్నర పాటు పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సుల్తాన్‌బజార్‌ బొగ్గుకుంట హనుమాన్‌ టెక్డీలోని వ్యాపార సముదాయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవ్వగా, పది వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్​కు మంటలు వ్యాపించి కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకెళ్తే

నిప్పురవ్వలతో ఘటన : బషీర్‌బాగ్‌కు చెందిన గుర్విందర్‌ సింగ్ అనే వ్యాపారి హనుమాన్‌ టెక్డీలో పారస్‌ ఫైర్‌వర్క్స్‌ దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చారు. అందరూ కొనుగోళ్లలో ఉండగా, దుకాణంలో ఒక్కసారిగా పటాసులు ఒకదాని వెంట ఒకటి పేలాయి. భారీ శబ్ధాలు చేస్తూ క్షణాల్లో టపాసులకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కొనుగోలుదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఐదుగురు మహిళలు సహా 9మంది మృతి- మోదీ సంతాపం - Firecrackers Factory Blast

గాయపడ్డ మహిళ :మంటలు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌కు వ్యాపించడంతో లోపల సామగ్రి కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుకాణంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పది వరకు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఐదు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. బయటి నుంచి నిప్పు రవ్వలు వచ్చి దుకాణంలో పడటంతో మంటలు అంటుకున్నట్లు దుకాణంలో పని చేసే సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా టపాసుల దుకాణానికి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు.

దీపావళి పండుగకు క్రాకర్స్ షాపు పెట్టాలనుకుంటున్నారా? - ఈ రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే

దీపావళి వేళ ఫోన్‌పే కీలక నిర్ణయం- కేవలం 9 రూపాయలకే ఇన్సూరెన్! - పాలసీ ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Last Updated : Oct 28, 2024, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details