తెలంగాణ

telangana

ETV Bharat / state

నంద్యాల జిల్లాలో విషాదం - మట్టిమిద్దె కూలి నలుగురు దుర్మరణం - 4 KILLED IN NANDYAL SLAB COLLAPSE - 4 KILLED IN NANDYAL SLAB COLLAPSE

Four Killed in Slab Collapse in Nandyal District : ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో చోటు చేసుకుంది.

Four Killed in Slab Collapsed in Nandyal District
Four Killed in Slab Collapsed in Nandyal District (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:55 AM IST

Nandyal Mud Slab Collapse Updates : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్‌ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details