Fake Cop Arrested in Hyderabad : 'నీకు పోలీసు ఉద్యోగం కావాలా? నేను ఫలానా చోట ఎస్‌ఐగా పని చేస్తున్నాను. నాకు డిపార్ట్‌మెంట్‌లో పెద్ద వారితో పరిచయాలున్నాయి. వాళ్లను మేనేజ్ చేస్తే చాలు. సులభంగా ఉద్యోగం వస్తుంది. కాకపోతే ఖర్చు అవుతుంది. కానీ ఉద్యోగం రావడం మాత్రం పక్కా. అలాగే నీకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తాను.' పోలీసు ఉద్యోగం కోసం కలలు కనే యువకులను టార్గెట్‌గా చేసుకుని సోమ్లా నాయక్ చెప్పే మాయమాటలివి.
కొంపముంచిన పెళ్లిచూపులు - అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై
గవర్నమెంట్ ఉద్యోగాలకు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పైరవీలకు పాల్పడుతూ మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా ప్రచారం కల్పించినా, క్షేత్రస్థాయిలో ఉపయోగం లేకుండాపోతోంది. కొందరు వ్యక్తులు, మధ్యవర్తుల మాయమాటలను నమ్మి (Job frauds), ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చుననే ఆశతో, పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించుకుంటూ మోసపోతున్నారు. తాజాగా పోలీసు ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ, డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నకిలీ పోలీస్‌ను అరెస్టు చేశారు.
Jobs Trap Fraud in Hyderabad : తాను ఎస్‌ఐనని, పోలీస్ ఉద్యోగాలు (Police jobs) ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి మాసబ్‌ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన గౌరీ శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందుతుడిని సోమ్లా నాయక్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు, గతంలో సోమ్లానాయక్ ఆర్మీలో జీడీ కానిస్టేబుల్‌తో పాటు అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయనట్లుగా పేర్కొన్నారు.
అనారోగ్యంతో డ్యూటీని వదిలిపెట్టి, మధ్యలోనే వచ్చినట్లు గుర్తించారు. తర్వాత క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. సోమ్లా నాయక్‌కు పోలీస్ వృత్తిపై బాగా ఇష్టం ఉండటంతో, పలు కార్యక్రమాలకు కూడా పోలీస్ యూనిఫాంలో వెళ్లినట్లు గుర్తించారు. తర్వాత తమ ప్రాంతంతో పాటు పలు చోట్ల పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను టార్గెట్ చేసుకున్నట్లు తెలిపారు. వారికి పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, డబ్బులు లాగేవారని తెలిపారు. ఇప్పటి వరకు అలా నమ్మించి రూ.11 లక్షలు మోసం చేసినట్లు వెల్లడించారు. నిందితుడు సోమ్లా నాయక్ నుంచి పోలీస్ యూనిఫాంతో పాటు 2 స్టార్ ఉన్న షోల్డర్ ఫ్లాప్, పోలీస్ టోపీ, పోలీస్ బూట్లు, నేమ్ ప్లేట్, ఒక ద్విచక్ర వాహనం, చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గొర్రెల స్కామ్‌లో కీలక నిందితుడిని బురిడీ కొట్టించిన మోసగాడు - ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ రూ.3.40 లక్షలు వసూలు - Sheep Distribution Scam Updated
ఈడీ అధికారుల్లా నటించారు- రూ.1.69 కోట్లు కాజేశారు- చివరకు ఏమైందంటే?