Anakapalli News Today: ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అనకాపల్లి జిల్లా ఉమ్మలాడ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు - లావణ్య దంపతులకు ఆహ్వానం లభించింది. సూర్యఘర్ పథకం కింద ఇంటి వద్ద సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తీసిన డ్రాలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి నాగేశ్వరావు లావణ్య దంపతులకు ఆహ్వానం అందింది.
దిల్లీలో గణతంత్ర వేడుకలకు అనకాపల్లి దంపతులు - SURYAGARH SCHEME IN UMMALADA
సూర్యఘర్ పథకం కింద ఇంటికి సోలార్ ఏర్పాటు - గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి తీసిన డ్రాలో ఎంపిక
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2025, 12:35 PM IST
దిల్లీలో గణతంత్ర వేడుకలకు దంపతులు:గత ఏడాది నూతనంగా ఇంటి నిర్మాణం చేసిన దంపతులు 5 కె వి సామర్థ్యంతో ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సూర్యఘర్ పథకం కింద 3.50 లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌కి 89వేల సబ్సిడీ లభించింది. నెలకి 2500 నుంచి 3 వేల వరకు విద్యుత్ బిల్లు వచ్చేదని దీని ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడు విద్యుత్ బిల్లు జీరో వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు నెలకి రూ 300 నుంచి 600 వరకు నగదు బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంట్లో ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిడ్జ్ ఇలా అన్ని పరికరాలు సోలార్ విద్యుత్ నుంచే పనిచేస్తున్నాయని వివరించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి తీసిన డ్రాలో తమ పేరు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని లావణ్య తెలిపారు. కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనడానికి దిల్లీ వెళ్తున్నట్లు ఆమె వివరించారు.
రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో విజేతగా స్టార్ హీరో
ముంబయిలో చెర్రీ ఫ్యామిలీ- క్లీంకారకు కరీన బిగ్ హెల్ప్!- బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సా?