8th Day OF Srivari Brahmotsavam : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఎస్ఈ శ్రీమనోహరం పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణ వెంకన్న రథోత్సవం - తిరుమల శ్రీవారి సేవలో సినీనటులు - 8TH DAY OF SRIVARI BRAHMOTSAVAM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొణిదెల నిహారిక, మంచు విష్ణు, శివబాలాజీ తదితరులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2025, 3:51 PM IST
Niharika Konidela Visited Tirumala Temple : సినీనటి, నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తరువాత నిహారికకు అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని సినీనటులు మంచు విష్ణు, శివ బాలాజీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప చిత్రం మంచి విజయం సాధించాలని విష్ణు స్వామివారిని వేడుకున్నానన్నారు.