Minor Girl Rape in Nandyala : ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో చివరకు జాగిలాల సాయం తీసుకున్నారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు.