4Kgs Gold Theft in Sangareddy Today :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీ జరిగింది. సత్వార్లోని కోహినూర్ దాబా వద్ద ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న గుమస్తా, కిందికి దిగి టిఫిన్ చేసి వచ్చేలోపు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నగల బ్యాగుతో ఉడాయించారు.
అయ్యో పాపం!! - టిఫిన్ చేద్దామని బస్సు దిగితే - 4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు - 4KGS GOLD THEFT IN SANGAREDDY - 4KGS GOLD THEFT IN SANGAREDDY
4Kgs Gold Theft in Sangareddy : ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీకి గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బంగారం వ్యాపారి నుంచి భారీగా పసిడిని చోరీ చేయగా, ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : Jul 27, 2024, 2:26 PM IST
|Updated : Jul 27, 2024, 5:31 PM IST
దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దాబాలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. సుమారు రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు పోగొట్టుకున్న గుమస్తా సహా ఆభరణాల వ్యాపారులు చిరాగ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ శివలింగం దాబాను సందర్శించి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో బంగారం మాయమవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. కాగా ఈ ఉదంతానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.