తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగి ఉన్న కారును ఢీకొట్టిన టిప్పర్​ - ముగ్గురు యువకుల మృతి, మరో ముగ్గురికి గాయాలు - Sangareddy Accident

3 Died in Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న కారును టిప్పర్​ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Sangareddy Car Accident
Road Accident In Sangareddy

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 2:16 PM IST

3 Died in Sangareddy Road Accident : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న తప్పిదాల వల్ల ఏకంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఒక్కోసారి మనం జాగ్రత్తలు తీసుకున్నా, ఎదుటి వాహనం అతి వేగం వల్ల ప్రమాదాలు (Accidents) చోటు చేసుకుంటున్నాయి. హెల్మెట్​ పెట్టుకోకపోవడం, సీటు బెల్ట్​ పెట్టుకోకపోవడం వంటి చిన్న తప్పిదాలు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల నేషనల్​ హైవేపై సికింద్రాబాద్​ కంటోన్మెంట్​​ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita) ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆందోల్​ డాకూర్​ గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఆగి ఉన్న కారును టిప్పర్​ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

Sangareddy Car Accident :కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు కొద్ది దూరం వెళ్లాక మూత్ర విసర్జనకు ఆగారు. అలా ఆగడమే వారి పాలిట శాపంగా మారింది. టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. మరో ముగ్గురిని గాయాల పాలు చేసింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy) ఆందోల్ మండలం మాసాన్​పల్లి - డాకూర్ గ్రామ శివారులో అర్ధరాత్రి ఆగి ఉన్న కారును టిప్పర్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు డాకూర్‌ శివారులోని ఓ హోటల్‌లో రాత్రివేళ టీ తాగి తిరిగి జోగిపేటకు బయలుదేరారు. మాసాన్​పల్లి వద్దకు రాగానే కారును రోడ్డు పక్కన నిలిపి ఆరుగురిలో నలుగురు మూత్ర విసర్జనకు దిగారు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సును ఢీకొట్టిన లారీ, ఏడుగురు మృతి

ఆగి ఉన్న కారును ఢీ కొన్న టిప్పర్​ :వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ బలంగా కారును ఢీకొట్టి, కారు ముందున్న నలుగురి మీది నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ చక్రాల కింద నలిగిపోయిన వాజిద్‌, హాజీ, ముకరం అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రిజ్వాన్‌ అనే మరో యువకుడికి కాలు విరగగా, కారులోనే కూర్చొని ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరణించిన ముగ్గురిలో ఒకరికి ఈ మధ్యే వివాహమయ్యింది. చేతికొచ్చిన బిడ్డల అకాల మరణం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆందోల్​లో రోడ్డు ప్రమాదం - ఆగి ఉన్న కారును టిప్పర్​ ఢీ కొనడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి

అల్వాల్​లో దూసుకొచ్చిన డీసీఎం - కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం

వరుడి ఇంట్లో 'తిలక్' వేడుక- తిరిగివస్తుండగా ప్రమాదం- 'వధువు' కుటుంబంలో ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details