తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరి చెరువులో 25 కేజీల భారీ చేప చిక్కింది - మత్స్యకారుల పంట పండింది! - BIG SIZE FISH IN NIZAMABAD

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో చేపూర్ గ్రామ ఊర చెరువులో 25 కేజీల చేప - సంతోషం వ్యక్తం చేసిన మత్స్యకారులు

25 KG FISH CAUGHT IN NET NIZAMABAD
Big Size Fish in Nizamabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 8:30 AM IST

Big Size Fish in Nizamabad: చెరువుల్లో మామూలుగా 5 నుంచి 10 కిలోల చేపలు దొరకడమే కష్టం. అప్పుడప్పుడు ఎవరైనా పెద్ద చేపలు కావాలని వస్తే మత్స్యకారుల దగ్గర నుంచి లేదనే సమాధానం వస్తుంది. ఇలా ఎప్పుడూ 5 కిలోల చేపలకే పరిమితం అయ్యే మత్స్యకారులకు భారీ చేప వలకు చిక్కితే ఆ ఆనందంమే వేరు. కచ్చితంగా వారు ఎగిరి గంతేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Big Size Fish in Nizamabad (ETV Bharat)

తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపుర్ గ్రామ ఊర చెరువులో మత్స్యకారులకు 25 కేజీల భారీ చేప వలలో చిక్కింది. ఈ చెరువులో ఈ చేప ఎన్నాళ్లు పెరిగిందో తెలీదు గానీ ఏకంగా ఇంత పెద్ద చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇంత పెద్ద చేప వలకు చిక్కిన విషయం గ్రామస్థులకు తెలియడంతో చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆనందంతో ఆ పెద్ద చేపతో ఫొటోలు దిగారు. ఏది ఏమైనా ఈ చెరువులో ఇంత పెద్ద చేప దొరకడంతో మత్స్యకారులకు కాసుల పంట పండినట్లే. కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details