తెలంగాణ

telangana

ETV Bharat / state

టీచర్లకు గుడ్​న్యూస్​ - త్వరలోనే పదోన్నతులు, బదిలీలు - రెండ్రోజుల్లో షెడ్యూలు విడుదల? - TELANGANA TEACHER PROMOTIONS 2024

TS Teacher Promotions and Transfers News : తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్​ న్యూస్​. మరికొన్ని రోజుల్లో ఉపాధ్యాయుల​ పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేయనుంది. 19వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూలును విడుదల చేయనున్నారు.

TS Teacher Promotions and Transfers News
TS Teacher Promotions and Transfers News (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 8:06 AM IST

Teacher Promotions and Transfers in Telangana :రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇక వేగం పుంజుకోనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో మరో రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల కావచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ప్రక్రియ పూర్తైతే మాత్రం 19 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన ఫైల్​ను సీఎం వద్ద అధికారులు పంపించారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూలును విడుదల చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియ గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే జరగాల్సింది కానీ కోర్టులో కేసులు వల్ల ఆగిపోయింది. పదోన్నతులకు టెట్​లో ఉత్తీర్ణత తప్పనిసరి అని సెప్టెంబరు నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియ కాస్త కాస్త ఆగింది. దీనికి తోడు 317 జీవో వల్ల ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతామని హైకోర్టులో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్​ దాఖలు చేశారు.

Teacher Transfers in Telangana : అయితే అప్పటికే మల్టీ జోన్​-1(వరంగల్​)లో గెజిటెడ్​ హెచ్​ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తి అయి 782 మంది పదోన్నతులు పొందారు. కానీ స్కూల్​ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి. అయితే పదోన్నతులు మాత్రం పూర్తి కాలేదు. అలాగే వారిని పాత స్థానాల నుంచి రిలీవ్​ చేయలేదు. ఎస్​జీటీల బదిలీలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. అయితే మల్టీజోన్-2(హైదరాబాద్​)లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో గెజిటెడ్​ హెచ్​ఎంల బదిలీలు, పదోన్నతులు పూర్తి అయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కగా, జడ్పీ ఉన్నత పాఠశాలల జీహెచ్​ఎం బదిలీలు అయ్యాయి. మిగిలినవి ఆగిపోయాయి.

రెండు షెడ్యూళ్లు విడుదల? : రెండు రకాల షెడ్యూళ్లను పాఠశాల విద్యాశాఖ ఇవ్వనుంది. మల్టీజోన్​-1లో కొంత ప్రక్రియ పూర్తయినందువల్ల దానికి ఒక షెడ్యూల్​, మల్టీజోన్-2కు మరో షెడ్యూల్​ జారీ చేయనున్నారు. మల్టీ జోన్​-1లో స్కూల్​ అసిస్టెంట్​ పదోన్నతుల నుంచి ప్రక్రియ ప్రారంభం. మల్టీజోన్​-2కు మరో షెడ్యూల్​ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం గతేడాది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానున్నది.

అర్హులైన వారి ఏ విధంగా పదోన్నతులు కల్పిస్తారో తెలుసుకుందాం. భాషా పండితుల పోస్టుల అప్​గ్రెడేషన్​పై హైకోర్టు డివిజన్​ బెంచ్​ గత మార్చిలో తీర్పు వెలువర్చింది. ఎస్​ఏ భాషా పండితుల పోస్టులకు భాషా పండితులు అర్హులు. ఈ పోస్టులకు ఎస్​జీటీలు అర్హులు కారని పేర్కొంది. దాంతో 8,630 మంది భాషా పండితులకు, 1,819 పీఈటీలకు మొత్తం 10,449 మందికి ఎస్​ఏలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 6 వేల మంది ఎస్​జీటీలు స్కూల్​ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. మల్టీజోన్​-2లో 778 మంది గెజిటెడ్​ ప్రధానోపాధ్యాయులు, రెండు మల్టీజోన్లలో కలిపి 2,400 మంది ఎస్​జీటీలు ప్రాథమిక పాఠశాల హెచ్​ఎంలు కానున్నారు.

Teacher promotions Postpone Telangana : టీచర్లకు షాకింగ్ న్యూస్.. పదోన్నతులకు బ్రేక్​.. ఎందుకంటే!

USPC Demands for Techers Promotions : 'సెలవులు అయ్యేలోగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి'

ABOUT THE AUTHOR

...view details