తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలిక ప్రాణం తీసిన కుట్టుమిషన్​ సూది! - ఘట్​కేసర్​లో విషాదం - 15 YEARS GIRL SUICIDE IN HYD

కుట్టు మిషన్ సూది విరగొట్టిన బాలిక - తల్లి మందలించడంతో ఆత్మహత్య - హైదరాబాద్​లోని ఘట్​కేసర్​లో ఘటన

15Years Girl Committed Suicide After Being Scolded By Her Mother
15Years Girl Committed Suicide After Being Scolded By Her Mother (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 12:42 PM IST

15Years Girl Committed Suicide After Being Scolded By Her Mother :కుట్టు మిషన్ సూది విరగొట్టిందని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్​ సీఐ బి.రాజు వర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన డోలు కోటయ్య, కవిత దంపతులు జీవనోపాధికి ఘట్​కేసర్​ మండలం చౌదరిగూడకు వచ్చారు. వీరికి కుమారుడు, ఇద్దరు అమ్మాయిలున్నారు.

రెండో కుమార్తె ఏడో తరగతి చదివి పాఠశాలకు వెళ్లడం లేదు. కుట్టు పని నేర్చుకుంటోంది. శుక్రవారం రాత్రి మిషన్​కు సంబంధించిన సూది విరగొట్టడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుంది. ఇంటి సమీపంలోని వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుమార్తెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details