తెలంగాణ

telangana

ETV Bharat / state

వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి దాకా అంతా ఇద్దరేసి - ఆ 12 గ్రామాల్లో 2 రాష్ట్రాల పాలన

ఏడాదిలో నాలుగోసారి ఓటేయడానికి సిద్ధంగా ఉన్న 12 గ్రామాలు - మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల సందడి - ఇటు తెలంగాణలోనూ అటూ మహారాష్ట్రలోనూ ఓట్లేస్తున్న గ్రామస్థులు

12 Villagers are Voting for Fourth Time in a Year
12 Villagers are Voting for Fourth Time in a Year (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

12 Villagers are Voting for Fourth Time in a Year :ఎవరైనా ఒక వ్యక్తి ఎన్ని ఓట్లు వేయొచ్చంటే ఠక్కున ఒక ఓటు అని సమాధానం చెప్తాం. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఒక్కో వ్యక్తి ఒకే ఏడాదిలో నాలుగుసార్లు ఓటేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఆ ప్రాంతం ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? ఇంతకీ వారు నాలుగు ఓట్లను ఎలా వేస్తున్నారో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం జిల్లా కెరమెరి మండంలోని 12 గ్రామాల పౌరులు నాలుగు ఓట్లను వేస్తారు. ఈ గ్రామాల ప్రజలకు తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ఓటు వేసే అరుదైన అవకాశం ఉంది. బోలాపటార్​, కోట, పద్మావతి, పరందోలి, ముకదమ్​గూడ, అంతాపూర్, మహరాజ్​గూడ, శంకర్​లొద్ది, ఇంద్రానగర్, గౌరి, లెండిగూడ, ఎస్సాపూర్​ గ్రామాల్లో రెండు రాష్ట్రాల పాలన సాగుతోంది. ఇక్కడ వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకూ అంతా ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉంటారు.

వీరు గతేడాది నవంబరు 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్​ నియోజకవర్గానికి ఓట్లేయగా, ఈ ఏడాది లోక్​సభ ఎన్నికల్లో ఏప్రిల్​ 19న మహారాష్ట్రలోని చంద్రపూర్​ ఎంపీ స్థానానికి ఓటేశారు. అలాగే మే 13న తెలంగాణలోని ఆదిలాబాద్​ ఎంపీ స్థానానికి ఓట్లేశారు. మళ్లీ ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజూరా నియోజకవర్గానికి ఓట్లు వేయనున్నారు.

రెండు రాష్ట్రాల గుర్తింపు కార్డులు చూపుతున్న పౌరుడు (ETV Bharat)

సుప్రీంలో పెండింగ్​లో కేసు : ఈ 12 గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోకి వచ్చాయి. కానీ 1987లో భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ మహారాష్ట్ర వీటిని చంద్రపూర్​ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. ఈ గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు కేకే నాయుడు కమిషన్​ను ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్​తో పాటు ఏపీ ఉమ్మడి హైకోర్టు కూడా ఈ గ్రామాలన్నీ ఉమ్మడి ఏపీవేనని తేల్చి చెప్పాయి. ఈ విషయంపై మహారాష్ట్ర.. సుప్రీంకోర్టులో సవాల్​ చేసింది. అప్పటి నుంచి కేసు పెండింగ్​లో ఉంది. ఇక్కడి ప్రజలు మాత్రం ఇరు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి: ప్రధాన ఎన్నికల అధికారి

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details