Yograj Singh On Yuvraj Singh :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పట్ల తన తండ్రి యోగ్రాజ్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2011 వన్డే వరల్డ్‌కప్ రోజులు గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న యువీ, మైదానంలో రక్తం కక్కుతున్నా అతడు గేమ్ ఆడాలని మాత్రమే కోరుకున్నానని తెలిపాడు. ఈ క్రమంలో యువీ చనిపోయినా తాను గర్వించే వాడినేనని యోగ్రాజ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.
'మన దేశానికి ప్రపంచకప్ సాధించే క్రమంలో, యువరాజ్ సింగ్ క్యాన్సర్ కారణంగా మరణించినా ఓ తండ్రిగా నేను గర్వపడేవాడినే. నా కొడుకు పట్ల నేను ఇప్పటికీ గర్వంగానే ఉన్నా. అతడు గ్రౌండ్లో రక్తం కక్కుకున్నప్పటికీ యూవీ క్రికెట్ ఆడాలనే కోరుకున్నాను. ఈ విషయం తనకు ఫోన్లో కూడా చెప్పాను. 'చనిపోతానని భయపడకు, నీకేం కాదు, భారత్ కోసం ఈ వరల్డ్‌కప్ గెలిపించు' అని నా కొడుక్కు చెప్పాను' అని యోగ్రాజ్ పేర్కొన్నాడు.
కాగా, 2011 ప్రపంచకప్ సమయంలో యువీ క్యాన్సర్‌తో బాధపడుతూనే టోర్నీలో బరిలోకి దిగాడు. టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో యూవీ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సహా 362 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున ఆ టోర్నీలో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.